Wednesday, March 26, 2025

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువతి మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్‌మిషిన్‌లో బట్టలు ఉతికే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఓ యువతి మృతిచెందిన సంఘటన బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల మేరకు.. అలీనగర్‌లో నివాసం ఉండే ఫాతిమాబేగం(17) సోమవారం ఉదయం 9 గంటల సమయంలో బట్టలు ఉతికేందుకు వాషింగ్‌మిషిన్ ప్లెగ్‌ను స్విచ్ఛ్‌ బోర్డులో పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఫా తిమా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News