Sunday, December 22, 2024

గుండెపోటుతో యువతి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఖమ్మం రూరల్‌: గుండెపోటుతో ఓ యువతి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కస్నాతండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అవిరేణి శిరీష (19) ఇటీవల ఇంటర్మిడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. శ్వాసకు సంబంధించి ఇబ్బంది పడుతూ గుండెపోటు రావటంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అప్పటికే శిరీష మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారని బంధువులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News