Wednesday, January 22, 2025

యువకుడితో కలిసి హోటల్‌లో బస.. యువతి మృతి

- Advertisement -
- Advertisement -

నగరంలో పనిచేస్తున్న పాండిచ్చేరికి చెందిన యువతి
మరో యువకుడితో కలిసి హోటల్‌లో బస
ఫుడ్‌పాయిజన్ కావడంతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు
మనతెలంగాణ, సిటిబ్యూరోః  ఓ యువతి అనుమానస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పాండిచ్చేరికి చెందిన శర్వణప్రియ నగరంలో ఉంటూ హెటీరో ఫార్మసీలో పనిచేస్తోంది. ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్న చెన్నైకి చెందిన శ్రీహరి రమేష్ మంగళవారం చెన్నై నుంచి యువతిని కలిసేందుకు హైదరాబాద్‌కు మంగళవారం రాత్రి వచ్చాడు. ఇద్దరు కలిసి మాదాపూర్‌లోని చంద్రునాయక్ తండాలోని ఓయోలో రాత్రి 9గంటలకు రూమ్ తీసుకున్నారు. ఇద్దరు హోటల్‌లో మద్యం సేవించారు. తర్వాత రమేష్ వాంతులు ఫుడ్ పాయిజన్ కావడంతో చాలాసార్లు వాంతులు చేసుకున్నాడు.

వాంతులు ఎక్కువ కావడంతో తెల్లవారుజామున 2 గంటలకు శ్రీహరి రమేష్ మాదాపూర్‌లోని శ్రావణి ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యాడు, మధ్యాహ్నం 2 గంటలకు డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ఓయో రూమ్‌కు వచ్చి చూసేసరికి రూమ్‌లో శ్వరణప్రియ కింద కూర్చుని ఉంది. పిలిచినా స్పందింకపోవడంతో కదిలించేసరికి కిందపడిపోయింది. వెంటనే హోటల్ సిబ్బంది సాయంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి శర్వాణిని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు.

రాత్రి 10.49 గంటల సమయంలో శర్వాణి రిసెప్షనిస్టుకు ఫోన్ చేసి గదిని పొడిగించాలనుకుంటున్నట్లు చెప్పారని హోటల్ సిబ్బంది చెప్పారు. తర్వాత జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిందని, దానిని అందించేందుకు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News