Monday, January 20, 2025

నగరం రక్తసిక్తం

- Advertisement -
- Advertisement -

నగరం ఒక్కసారిగా రక్తసిక్తం అయింది, ముగ్గురు హత్యకు గురికాగా, ఓ విద్యార్థి బస్సు ప్రమాదంలో మృతిచెందింది, మరో మహిళ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వరుస సంఘటనల నేపథ్యంలో ఒక్కసారిగా నగరంలో అలజడి రేగింది. చిన్న చిన్న కారణాలతో ముగ్గురిని హత్య రోడ్డుపై హత్య చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్, రాయల్ కాలనీకి చెందిన సయ్యద్ సమీర్ గుర్తుతెలియని వ్యక్తులు తల్వార్‌తో దారుణంగా హత్య చేశారు. డెకరేషన్ పనిచేసే సమీర్ రాయల్ కానీ నుంచి ఇంటికి వస్తుండగా నిందితులు హత్య చేశారు. సంఘటన జరిగిన ప్రదేశంలో చాలామంది గంజాయి తాగి తరచూ గొడవలకు దిగుతుంటారని స్థానికులు తెలిపారు. గంజాయి బ్యాచ్ హత్య చేసి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు నిందితులను పుట్టకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆసిఫ్ నగర్‌లో మరో యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు. కుతుబుదిన్ అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచి విచక్షణారహితంగా పొడిచారు.

కొందరు కర్రలతో కొట్టారు. దీంతో యువకుడు ఆస్పత్రికి తరలించిన తర్వాత మృతిచెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను ఆటోడ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. కర్ణాటక రాష్డ్రం, సేడం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(32) అనే మహిళ, భర్త, కుమారుడితో కలిసి నల్లగండ్ల,లక్ష్మివిహార్, ఫేస్ 1లో ఉంటోంది. స్థానికంగా ఉన్న అపర్ణ టవర్స్‌లో వంటమనిషిగా పనిచేస్తోంది. భర్త కూలీ పనులు చేస్తుంటాడు, ఇద్దరు కలిసి కుటుంబాన్ని పొషించుకుంటున్నారు. లింగంపల్లికి చెందిన ఆటోడ్రైవర్ భరత్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్, ఫైనాన్స్ కూడా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయలక్ష్మి సోదరుడు సునీల్ ఆటో కొనుగోలు చేసేందుకు గతంలో ఫైనాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విజయలక్ష్మి, భరత్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో విజయలక్ష్మిని నరికి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

ప్రమాదంలో యువతి…
ఆర్‌టిసి బస్సు కిందపడి యువతి మృతిచెందిన సంఘటన మధురానగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. యూసుఫ్‌గూడలోని మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ మెహరీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే కాలీజీకి వెళ్లిన యువతి ఆర్‌టిసి బస్సు ఎక్కింది మధురానగర్‌లో టర్నింగ్ వద్ద రన్నింగ్‌లో దిగడంతో బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అనురాధ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అనురాధ సీనియర్ అసిస్టెంట్‌గా ఎస్‌బిలో పనిచేస్తుండగా, భర్త జనార్దన్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోం అవతార్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్ 14వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News