Thursday, December 19, 2024

మత్తు మందిచ్చి యువతిపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒక 18 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మదన్‌గిర్‌కు చెందిన ఆ యువతిపై మాలవీయ నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెకు మత్తు మందిచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బుధవారం అంబేద్కర్ నగర్ పోలీసు స్టేషన్‌లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఇద్దరు నిందితులను ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. గత సోమవారం మధ్యాహ్నం(జనవరి 29) ఒంటి గంట ప్రాంతంలో ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని,

మదన్‌గిర్‌లోని ఒక ప్రాంతానికి తనను రమ్మన్నారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. స్కూటర్‌పై వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు తనను కూడా స్కూటర్ ఎక్కమన్నారని, కాని తాను నిరాకరించానని ఆమె తెలిపింది. అయితే వారు బెదిరించడంతో తాను స్కూటర్ ఎక్కానని ఆమె పేర్కొంది. మాలవీయ నగర్‌లో డిన్నర్ చేసిన తర్వాత తాను కళ్లు తిరిగి పడిపోయానని, ఆహారంలో డ్రగ్స్ కలిపారని ఆమె తెలిపింది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్లు తాను గ్రహించానని ఆమె తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 19, 21 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News