Wednesday, January 22, 2025

ఆత్మహత్యకు దారి తీసిన రుణ వసూలు..

- Advertisement -
- Advertisement -

థానే : మహారాష్ట్ర లోని థానే జిల్లాకు చెందిన లక్ష్మణ నరేంద్ర యాదవ్ అనే 34 ఏళ్ల యువతి రుణ వసూళ్ల వేధింపులకు తట్టుకోలేక జులై 6న ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అస్సాంకు చెందిన ఇద్దరు రుణవసూలు ఏజెంట్లను థానే రైల్వే పోలీస్‌లు అరెస్ట్ చేశారు. లక్ష్మణ నరేంద్రయాదవ్ రుణవసూలు వేధింపులు తట్టుకోలేక జులై 6న దివా వద్ద రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుందని సీనియర్ ఇన్‌స్పెక్టర్ పంధారీ కండే చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయగా,

యాదవ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం ద్వారా రూ.19 వేలు రుణం తీసుకుందని, రుణం ఇచ్చిన కంపెనీ ఏజెంట్లు ఇద్దరు ఆమెను రుణం చెల్లించాలంటూ పదేపదే వేధించడం ప్రారంభించారని తెలిపారు. ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో ప్రసారం చేసి ఒత్తిడి తీసుకు వచ్చారని ఇన్‌స్పెక్టర్ వివరించారు. రైల్వే పోలీస్‌లు నిందితుల కోసం గాలించి అస్సాం లోని ఓ గ్రామంలో నవంబర్ 13 న అరెస్టు చేశారని తెలిపారు. నిందితులు శంకర్ నారాయణ్ హెజాంగ్ (29), ప్రశాంజిత్‌నృపేన్ హెజాంగ్ (32) టీస్టాల్ నడుపుతున్నారని గుర్తించినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News