Thursday, December 26, 2024

నా కూతురిని కాపాడండి..ఓ కన్నతల్లి వేదన

- Advertisement -
- Advertisement -

నా కూతురిని కాపాడంటూ ఓ కన్నతల్లి వేదన హృదయాన్ని కలిచివేస్తోంది. 25 ఏళ్ళ సుశీల కూతురు జ్యోతి ఆదివారం ప్రమాదవశాత్తు ఐదంతస్తుల భవనంపై నుండి జారి కింద పడిందని తల్లి సుశీల పేర్కొంది. హుటాహుటిన స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తెచ్చామని, ఇక్కడ ప్రాథమిక వైద్యం నిమిత్తం స్కానింగ్ చేయాగా వెన్నముక ఎముక, ఎడమ కాలు విరిగినట్లు ఎమర్జెన్సీ ఓపి డాక్టర్లు తెలిపారని, సర్జరీ చేయాలన్నారని చెప్పింది. ఎపి శ్చిమగోదావరి జిల్లాకు చెందిన జ్యోతి ఆరోగ్యశ్రీ కార్డు ఎపికి చెంది ఉండడంతో సర్జరీ ఇక్కడ కుదరదు అని చెప్పారని తెలిపింది. ఇక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ విధులు బహిష్కరించి స్ట్రైక్ లో ఉన్నారని చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. నా కూతురు ప్రాణపాయ స్థితిలో వుందని, అయ్యా చనిపోయిన లేడీ డాక్టర్ కూడా ఒక నా కూతురిలాంటిదే, దయచేసి నా కూతురిని కాపాడాలని ఆ తల్లి తల్లడిల్లింది.

మంత్రి మానవీయం… చికిత్సకు ఆదేశం
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే తక్షణం స్పందించారు. గాంధీ ఆసుపత్రి సూపరిoటెండెంట్ డా. రాజకుమారితో మాట్లాడారు. మెరుగైన చికిత్స ను అందించాల్సిందిగా గాంధీ ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను మంత్రి అదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News