Tuesday, January 21, 2025

వరంగల్ లో యువతిని కారులో బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఓ యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువతి వరంగల్ శివారులోని ఓ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ కాలేజీలో చదువును కొనసాగిస్తోంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకు వెళ్లి కలిశాడు. ఆమెతో మాట్లాడే పని ఉందంటూ ఆమె కారులో ఎక్కించుకొని బయటకు తీసుకెళ్లాడు.

అప్పటికే కారులో ఇద్దరు ఉండడంతో రాను అని యువతి నిరాకరించింది. కానీ ముగ్గురు కలిసి బలవంతంగా ఆమెను కారులో వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపంలోని లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. యువతికి బలవంతంగా మద్యం తాగించి అనంతరం ఆమెపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. పరీక్షలు ఉండడంతో యువతి ఈ విషయం ఎవరికి చెప్పలేదు. తన సొంతూరుకు వెళ్లిన తరువాత జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి లాడ్జికి సంబంధించిన సిసి కెమెరాల ఫుటేజీలను తీసుకున్నారు. లాడ్జి నిర్వహకుల వద్ద ఉన్న ఆదార్ కార్డుల సహాయంతో యువకుడిది భూపాలపల్లిగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మూడో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువతిని భరోసా కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News