Sunday, January 19, 2025

యువకుడి వేధింపులతో యువతి…

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పాల్వంచ రూరల్ : వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఉరివేసుకొని బలవర్మరణం చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మండల పరిధి యానంబైల్ కు చెందిన బొప్పిశెట్టి నరసింహరావు, సుజాతలు తన కుటుంబంతో గత రెండు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం డోర్నకల్ దగ్గర బంజర గ్రామానికి వలస వెళ్ళారు. వారి కూతురు సాయికీర్తన స్థానికి కళాశాలలో ఇంటర్ మీడియెట్ చదువుతున్నది. కొంత కాలం నుండి యానంబైల్ కు చెందిన ఓ యువకుడు సాయి కీర్తన సెల్‌ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు.

దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన కీర్తన వారి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీనిని గమనించిన వైద్యులు ఆసుపత్రిలో జాయిన్ చేసుకోవాటానికి నిరాకరించారు. దీనితో తిరిగి ఖమ్మం తీసుకొచ్చారు.చికిత్స అందిస్తుండగానే మంగళవారం మృతి చెందినది. మృత దేహాన్ని సొంత గ్రామానికి తీసుకొచ్చారు. వేధింపులకు గురి చేసిన యువకుడిని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు అంటున్నారు. కాగా ఇదే యువకుడు గతంలో కూడా మరో యువతిని తీవ్రంగా వేధింపులకు గురిచేశాడని పలువురు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News