Sunday, December 22, 2024

లిఫ్ట్ పేరుతో యువతి వేధింపులు…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్ అయ్యింది. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం, వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లో వెళితే సయీదా నయీమా సుల్తానా అనే మహిళ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కెబిఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలని కారులో వస్తున్న పరమానందను ఆపింది. సరే అని పరమానంద ఆమెను ఎక్కించుకున్నాడు.

కొద్ది దూరం ప్రయాణించగానే తనకు డబ్బులు ఇవ్యాలని నయీమా సుల్తానా డిమాండ్ చేసింది. లేకుంటే తనను రేప్ చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పరమానందను బెదిరించింది. తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసంటూ దబాయింపులకు గురిచేసింది. బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. దీంతో బాధిత డ్రైవర్ పరమానంద చేసేదేమి లేక జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సయీదా నయీమా సుల్తానా పై ఐపిసి సెక్షన్ 389 కింద కేసు నమోదు చేశారు. సుల్తానా మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి విచారించారు. పలువురు అమాయకుల మీద కేసులు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News