Sunday, December 22, 2024

యువతిపై అఘాయిత్యానికి యత్నం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః యువతిపై అఘాయిత్యానికి యత్నించిన సంఘటన నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు యత్నించిన యువతి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. పోలీసులు కథనం ప్రకారం….తార్కాకకు చెందిన ఆర్తి అనే యువతి గత నెల 26వ తేదీ రాత్రి 11గంటలకు పాలడబ్బా తెచ్చేందుకు బయటికి వెళ్లింది. అయితే మెడికల్ షాపు మూసి ఉండడంతో ఆటో కోసం రోడ్డుపై చూస్తోంది. ఈ క్రమంలోనే బైక్‌పై వచ్చిన యువకుడిని మెడికల్ షాపు గురించి అడిగింది. కొంచెం ముందు ఉందని, అక్కడిదాకా లిఫ్ట్ ఇస్తానని చెప్పడంతో బైక్ ఎక్కింది.

కొంత దూరం సల్మాన్ హోటల్ వద్దకు వెళ్లగానే అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. తన రూమ్‌కు రావాలని, అసభ్యంగా మాట్లాడాడు,దీంతో అతడి నుంచి తప్పించుకోవాలని బైక్‌పై నుంచి ఒక్కసారిగా కిందకి దూకింది. అదేసమయంలో వెనుక నుంచి టిప్పర్ లారీ రావడంతో ఆమెపై నుంచి వెళ్లింది. ఆర్తి కేకలు విన్న స్థానికులు వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆర్తి కోమాలోకి వెళ్లింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News