Monday, January 20, 2025

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కర్నాటక రాష్ట్రం, సాదిపూర్, గుల్బర్గాకు చెందిన కుమారి పాయల్ జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటోంది. పాయల్ ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవల ఇద్దరు విడిపోయారు. అప్పటి నుంచి బాధపడుతున్న పాయల్ కెబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు పాయల్ మృతదేహం కోసం చెరువులో గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News