Monday, December 23, 2024

లద్నూర్ లో యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్ళి వస్తున్న యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఇదిలా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో నుండి యువతిని బస్టాండ్ సమీపంలో కింద తోసేసి వేగంగా వెళ్ళడాన్ని గమనించిన స్థానికులు వాహనాన్ని వెంబడించారు.

దీంతో నిందితుడు కారును అతివేగంగా నడపడంతో అదుపు తప్పి దుర్గమ్మ గుడి దగ్గర కమాన్ పిల్లర్ను ఢీ కొట్టింది.  నిందితుడు కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. అనుమానస్పదంగా ఓ వ్యక్తి కనిపించగా అతడిని విచారించారు. వదిలేని వెళ్ళిన కారు తనదే అని  నరేష్ అనే వ్యక్తి తెలిపాడు. తన స్నేహితుడు బస్టాండ్‌లో తనను వదిలి ఒక్కడే వెళ్ళిపోయాడని తెలిపారు. యువతిని తల్లిదండ్రలు విచారించగా తనని బలవంతంగా కారులో ఎక్కించుకొని పోయి అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో బాధితురాలు తల్లిదండ్రలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News