- Advertisement -
మేడ్చల్ జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుషాపూర్‌లో ఓ యువతిని కొందరు దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో యువతి తల్లి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. హైదరాబాద్- వరంగల్ హైవేపై భువనగిరి వైపు దుండగులు యువతిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి బంధువే అపహరించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -