Monday, January 20, 2025

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమించిన ప్రియుడు గర్భవతిని చేసి వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో ఓ యువతి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మెదక్‌కు చెందిన నందినికి ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కూకట్‌పల్లికి చెందిన రాజశేఖర్ పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది, దీంతో చాలా కాలం నుంచి ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. వివాహం చేసుకుంటానని యువకుడు నమ్మించడంతో నందిని శారీరక సంబంధం పెట్టుకుంది.

ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చడంతో వివాహం విషయం రాజశేఖర్ దాటవేస్తు వచ్చాడు. చూస్తుండగానే గర్భం దాల్చి 8 నెలలు కావడంతో రాజశేఖర్ తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన యువతి కొద్ది రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. తర్వాత నిందితుడు బెయిల్‌పై బయటికి రావడంతో తనకు న్యాయం జరగలేదని భావించిన బాధితురాలు ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన లేక్ పోలీసులు యువతిని కాపాడి బయటికి తీసుకుని వచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News