Sunday, January 26, 2025

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: నర్సు మృతి

- Advertisement -
- Advertisement -

Young woman killed in Road accident in Gachibowli

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. డిఎల్ఎఫ్ దగ్గర వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు, బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తక్షణమే చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News