Wednesday, January 22, 2025

టెక్సాస్ కాల్పుల్లో తెలంగాణ యువతి మృతి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ అమ్మాయి మృతి చెందింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రం అలేన్ పట్టణంలో ఓమాల్‌లో జరిగిన కాల్పుల్లో 9 మంది చనిపోయిన విషయం విదితమే.ఐదేళ్ల చిన్నారి సహ ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్దితి విషమంగా ఉంది . అవుట్‌లేట్ అనే పెద్ద మాల్‌లో స్దానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఘటన జరిగింది.

ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సరూర్‌నగర్ హుడా కాలనీలో నివాసం ఉంటున్న తాటికోండ ఐశ్వర్యరెడ్డి (27) యువతి తూటాలకు బలైంది. ఐశ్వర్య అమెరికాలో ఫర్‌ఫెక్ట్ జనరల్ కాంట్రాక్‌స్ట్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తుంది . ఆమె తండ్రి నర్సిరెడ్డి ,రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. తల్లి పేరు అరుణ ,కూతురు మరణవార్త విని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News