Tuesday, March 4, 2025

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జవహర్‌నగర్: ప్రేమ పేరుతో యు వకుడి వేధింపులకు గురి చేయడంతో ఓ యువతి ఆ త్మహత్య చేసుకుంది. దీంతో యువతి తల్లిదండ్రు లు,బంధువులు న్యాయం చేయాలంటూ బుధవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన ని ర్వహించారు. న్యూ భవానీనగర్ కాలనీలో నివసించే పొనగంటి తనిష, హారికల కూతురు పూర్ణిమ (19) ఈసిఐఎల్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. గత కొంత కాలంగా ని ఖిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గు రి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన యువతికి ఫో న్ కాల్ నుండి వేధింపులు రావడంతో యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా,

గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ఈసిఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందింది. ఈ విషయమై తల్లిదండ్రులు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా నిందితుడిని అరెస్ట్ చేయలేదని బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్ ముందు మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదన్నారు. దీంతో కుషాయిగూడ ఎసిపి మహేశ్, జవహర్‌నగర్ సిఐ సైదయ్య బాధితులతో మాట్లాడి పూర్తి న్యాయం చేస్తామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News