రేగొండః సెల్‌ఫోన్ పోయిందని విషయంలో చెల్లెతో గొడవ పడి అక్క సూసైడ్ చేసుకున్న ఘటన రేగొండ మండలంలోని రామన్నగూడెం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామన్నగూడెం తండాకు చెందిన జగ్గు రమ్య(22) నర్సింగ్ చదువుతుంది. ఇటివల ఇంటికి వచ్చింది. తన సెల్‌ఫోన్ గురువారం ఉదయం కనిపించకపోవడంతో తన చెల్లితో గొడవపడింది. దానితో నానమ్మ స్వరూప, తండ్రి రవి మరొక సెల్ కొనిస్తామని చెప్పారు.
Also Read: ప్రాణాలైనా తీసుకుంటాం..ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టనివ్వం
ఇంకెప్పుడు కొనిస్తారని ఆగ్రహించి తీవ్ర మనస్తాపపం చెంది కుటుంబ సభ్యుల ఎదుటనే ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌కు తరలిస్తున్న క్రమంలో మార్గమద్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి నానమ్మ స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.