Thursday, January 23, 2025

వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కొందుర్గు : ఫ్యాన్‌కు ఉరి వేసుకొని యువతి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బైరంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం… బైరంపల్లి గ్రామానికి చెందిన కందివనం లక్ష్మయ్య కుమార్తె అనూష (22) అనే యువతి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. గత కొన్ని నెల్లలుగా అనూషకు తల్లిదండ్రులు పెళ్లి సంబందాలను చూస్తుండగా ఇదే గ్రామానికి చెందిన పెద్దింటి శ్రీకాంత్ అనే వ్యక్తి అనూషను ప్రేమిస్తున్నాని చెప్పి పలుమార్లు వేధించాడని ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శ్రీకాంత్ నీకు పెళ్లి అయ్యింది మా అమ్మాయిని వేదించొద్దని సర్ది చేప్పారని తెలిపారు.

కాగా కొన్ని రోజుల క్రితం అనూషకు వేరొక వ్యక్తితో పెళ్లిని నిశ్చయించుకున్నారని ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ పెళ్లి నిశ్చయించిన అబ్బాయికి పోన్ చేసి ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఈమెను నేను పెళ్లి చేసేకుంటానని చెప్పడంతో ఆ సంబంధం చెడిపోయిందన్నారు. శ్రీకాంత్ వేధింపులను భరించలేక తనకు వచ్చిన సంబందాన్ని చెడ్డగొటడంతో మన స్థాపం చెంది శుక్రవారం రాత్రి అందరు నిద్రించిన తర్వాత అనూష ఇంట్లోని ఫ్యానుకు చున్నితో ఉరి వేసుకొని మృతి చెందిందని మృతురాలి అన్న కందివనం రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News