Sunday, December 22, 2024

ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ములుగు జిల్లాకు చెందిన సాహితి(26) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంటూ ఎంబిఏ చదువుతోంది. ఈ క్రమంలోనే హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాహితి మృతదేహాన్ని కిందికి దించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News