హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని పెళ్లాడి నగలతో పారిపోయిన యువతి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా గూడలూర్ కు చెందిన రషిక సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలు తెరచి డబ్బున్న మగవారితో చాటింగ్ చేసేది. ఆ తర్వాత వారిని లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకునేది. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలతో పారిపోయేది.
తాజాగా సేలాం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాగ్రామ్ లో రషీక పరిచయం చేసుకుంది. మూర్తిని ప్రేమిస్తున్నానని రషిక చెప్పడందో, ఈ ఏడాది మార్చి 30న వివాహం చేసుకున్నారు. జులై 4న రషిక ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షలనగదు, 5 సవర్ల బంగారు ఆభరణాలతో పారిపోయింది. దీంతో మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూర్తి ఫిర్యాదుతో కిలాడి లేడి బాగోతం బయటపడింది. మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రషిక కోసం గాలిస్తున్నారు.
Also Read: కుమ్రంభీం ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత