- Advertisement -
హైదరాబాద్: బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని హిమయత్‌నగర్‌లో ఉంటున్న ఈర్ల వీరమ్మ ఇళ్లల్లో పనిచేస్తోంది. ఈమె కూతురు ఈర్ల అనూష(20) హిమాయత్‌నగర్‌లోని ఓ షాపులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. ఈ నెల 19వ తేదీన జీతం తెచ్చుకుంటానని చెప్పి ఇంట్లో చెప్పి బయటికి వెళ్లింది. సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. ఇంటికి వస్తున్నానని చెప్పిన అనూష ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఫోన్ చేసిన కాల్ కలవడంలేదు, దీంతో యువతి తల్లి నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు తెలిపారు.
- Advertisement -