- Advertisement -
శేరిలింగంపల్లి: అనుమానస్పదస్థితిలో యువతి అదృశ్యం అయిన సంఘటన చందానగర్ లో చోటుచోసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎండి హర్శద్ చందానగర పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నారు. తన అక్క శరణిషాద్ (25) ఈ నెల 4న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. సాయంత్రం అయిన ఇంటికి తిరిగి రాలేదు. తను కనిపించగా పోగా తన బట్టలు, తనకు సంబంధించిన వస్తువులు కూడా ఇంట్లో కనింపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు తన ఫోన్ చేశారు. సమాదానం లభించలేదు. తన స్నేహితులు, బంధువుల వద్ధ ఎంత వెతికిన ఫలితం లేకపోయింది. అదే క్రమంలో తన ఫేస్‌బుక్ ప్రెండ్ అయిన సల్మాన్ పైన అనుమానంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.
Young woman Missing in Serilingampally
- Advertisement -