Friday, December 20, 2024

డబిల్‌పూర్‌లో యువతి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ఓ యువతి దారుణ హత్యకు గురైన సంఘటన మేడ్చ ల్ పోలీస్టేషన్ పరిధిలోని డబీల్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ధరిత్రి సింగ్(22) అనే యువతి ఆరు నెలల క్రితం డబిల్‌పూర్ గ్రామంలోని మహంకాళి అమ్మ గుడి సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. అదివారం ఉదయం 10 గం టల సమయంలో ధరిత్రి సింగ్ ఉండే ఇంటి వద్ద నుంచి అరుపులు వస్తున్న విష యం గమనించిన స్థానికులు ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా ధరిత్రి సింగ్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురై కనబడింది.

స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించగా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రంగంలో దింపి దర్యాప్తును చేపట్టారు. కాగా జాగిలాలు ఘటనా స్థలం నుంచి కొద్ది దూరంలో ఉన్న మద్యం దుకాణం వరకు వెళ్లి ఆగి పోయాయి. చేతులు కట్టి, టవాలుతో గొంతు నులుమి హత్యచేసి నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
అక్రమ సంబంధంపై పోలీసుల ఆరా
యువతి హత్య వెనుక అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు చేపట్టారు. కాగా యువతి ఒంటరిగ ఒరిస్సా నుంచి జీవనోపాధికోసం వచ్చి డబిల్ పూర్ గ్రామ సమీపంలోని విల్లో స్ప్రింగ్ అనే రిసార్డులో పని చేస్తున్నది. అక్కడే మేనేజర్‌గా పని చేస్తున్న చాంద్ అనే వ్యక్తితో పరిచ యం పెంచుకుందని, కొద్ది రోజుల అనంతరం మృతురాలు విల్లో స్ప్రింగ్‌లో పని మానేసి ఓ ఇస్టార్ పరిశ్రమలో పని కోసం చేరి డబిల్‌పూర్ గ్రామంలోని మహాంకాళి ఆలయ సమీపంలోని ఇంట్లో అద్దెకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా చాంద్‌తో ఉన్న పరిచయం చివరికి అక్రమ సంబంధంగా మారటంతో ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..
మృతురాలు గర్భవతి
మృతురాలు గర్భవతిగా పోలీసులు అనుమానం వ్యక్త చేస్తున్నారు. చాంద్‌కు భార్య, కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతు రాలితో చాంద్ కు అక్రమ సంబంధం ఏర్పడి ఆమె గర్భం దాల్చడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News