Thursday, January 23, 2025

ప్లీజ్ నన్ను చంపకండి.. వేడుకున్న యువతి

- Advertisement -
- Advertisement -

టెల్‌అవీవ్ : ఇజ్రాయెల్‌లో ఉత్సాహంగా జరుగుతున్న ఓ డ్యాన్స్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడితో అనేక మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఒక్కసారిగా ఆకాశం నుంచి రాకెట్లు, మరోవైపు తూటాలతో మిలిటెంట్లు విరుచుకుపడడంతో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా పీస్ ఫెస్టివల్ లో పాల్గొన్న అర్గమణి (25) అనే యువతిని హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష మైంది. బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో అర్గమణి… మిలిటెంట్లను బతిమాలుతోంది. ‘ప్లీజ్ … నన్ను చంపకండి. దయచేసి విడిచిపెట్టండి. ’ అంటూ ఏడుస్తోంది.

ఆమె బాయ్‌ఫ్రెండ్ నాథన్‌ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది.అదే సమయంలో తన సోదరుడు కనబడడం లేదని మోషే ఓర్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బయటకు వచ్చిన ఈ వీడియో ఆధారంగా సోథన్‌ను కూడా కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇదే కాకుండా హమాస్ మూకలు ఓ జర్మన్ మహిళను నగ్నంగా ఇజ్రాయెల్ వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. వీటితోపాటు … పెద్ద సంఖ్యలో ప్రజల మృతదేహాలు రహదారిపై పడి ఉన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News