Monday, January 20, 2025

యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఆటోలో ఎక్కిన యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన గచ్బిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సంగారెడ్డికి చెందిన యువతి గచ్బిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేస్తోంది. యువతి మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్‌సి పురం వద్ద నుంచి గచ్చిబౌలికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. యువతి ఒంటరిగా ఆటోలో ఎక్కడంతో ఆమెపై కన్నేసిన ఆటోడ్రైవర్, ఆర్‌సి పురం నుంచి గచ్చిబౌలికి వస్తుండగా ఆటోడ్రైవర్ ఆటోను మసీద్‌బండవైపు తీసుకుని వెళ్లాడు. అక్కడ యువతిని బెదిరించిన ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. తర్వాత యువతిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.

సంఘటన స్థలం నుంచి బాధితురాలు బయటికి వచ్చి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు యువతిపై అత్యాచారం జరిగిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆర్‌సి పురం నుంచి గచ్చిబౌలి వైపు వచ్చిన ఆటోల గురించి ఆరా తీశారు. సిసిటివి ఫుట్‌జ్‌ను పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆటోకు నంబర్ ప్లేట్ లేనట్లు పోలీసుల విచారణలో తెలిసింది. యువతిపై ఒకరే అత్యాచారానికి పాల్పడ్డారా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News