Monday, March 3, 2025

సెల్ఫీ తీసుకొని యువతి సూసైడ్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లుగ్రామంలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడ మోసం చేయడంతో ఓ యువతి సెల్ఫీ తీసుకొని సుసైడ్ చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖ మ్మం నగరంలోని రమణ గుట్టకు చెందిన అలాష్ ఢీషోలో డ్యాన్సర్‌గా చేస్తుంటాడు.ఇతను ఖమ్మం నగరానికి చెందిన శ్రీ కళ్యాణి అలియాస్ కావ్యాను (32) గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించి, సహజీవనం చేస్తున్నారు. కాగా అభిలాష్ తన అమ్మమ్మ స్వగ్రామమైన పొన్నెకల్లుకు కావ్యను తీసుకువచ్చి రెండు నెలలుగా ఇక్కడ ఉంటున్నాడు.

ఈక్రమంలో నేను మరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని, నువ్వు నా కు వద్దు వెళ్లిపోవాలని యువతికి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు యువతి ఉద యం ఇంట్లో ఎవరు లేని సమయంలో సెల్ఫీ వీడియో తీసి తన చావుకు అభిలాష్ కారణమని చెప్పింది.అందుకనే తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆవేదన చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచరం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకొని,శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News