Sunday, December 22, 2024

పియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

- Advertisement -
- Advertisement -

బెజ్జంకి: గత కొద్ది రోజులుగా తనతో సహజీవనం చేసిన ప్రియుడు ఇప్పుడు తనను మోసం చేసి తప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తన జీవితానికి న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (వివాహిత) తన కుమారుడితో కలసి బైఠాయించిన సంఘటన మం డలంలోని చీలాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తనకు జరిగిన అన్యాయంపై వివరాలు వెల్లడించారు. చీలాపూర్ గ్రామంలోని ఎస్సి సా మాజిక వర్గానికి చెందిన యువతికి గత నాలుగు సంవత్సర క్రితం హైదరాబాద్ చెందిన వ్యక్తి తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక్క కుమారుడు సంతానం.

చీలాపూర్ గ్రామానికి చెందిన అమరరాజు కృష్ణ తన వెంటపడి దంపతుల మధ్య కలహాలు సృష్టించి తన కుటుంబాన్ని విడదీసాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం ఆయువకుడు కరీంనగర్ పట్టణములో ఆరునెలలు తనతో సహజీవనం చేయగా మూడు నెలల గర్భి న్నీ తొలగించుకొన్నానని,ఇప్పుడు నా జీవితానికి న్యాయం చేయాలని ఎంత వేడుకున్న దాటవేసే ధోరణి అవలంభిస్తున్న డాని ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు, స్థానిక కులు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది. బాధితురాలు బైఠాయించిన ఇంటి ఆవరణలో పోలీసులు బాధితురాలి వద్ద నుండి వివరాలు నమోదు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News