Sunday, December 22, 2024

నీళ్లు అనుకొని యాసిడ్ కలిపిన నీటిని తనపై పోసుకున్న విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

నగర శివారు శంకరంపల్లిలోని ఐసిఎఫ్‌ఎఐ యూనివర్సిటీలో ఓ యువతికి అనుమానాస్పద రీతిలో తీవ్రగాయాలయ్యాయి. తాను ఉంటున్న హాస్టల్లోని నాలుగో అంతస్థులో స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి, బకెట్‌లో ఉన్న నీటిని ఒంటిపై పోసుకోగానే శరీరంపై బొబ్బలు రావడంతో అప్రమత్తమైన యువతి స్నేహితుల సాయంతో ఆస్పత్రికి వెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యాసిడ్ కలిపిన నీటిని విద్యార్థిని తనపై పోసుకోవడం వల్లే గాయాలయ్యాయని అని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు, గాయానికి కారణం ఏంటనే విషయానిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం ఐసిఎఫ్‌ఎఐ చెందిన హాస్టల్ లో హౌస్ కీపింగ్ పనుల నిమిత్తం బకెట్‌లో వేడినీటితో పాటు యాసిడ్ కలిపి ఫ్లోర్ క్లీన్ చేయగా మిగిలిన యాసిడ్ వాటర్‌ని బకెట్ లొనే ఉంచడం జరిగింది. బాధిత విద్యార్థిని బకెట్‌లో ఉన్నది నీరు అనుకొని కాళ్లు, చేతులు కడుకోవడానికి ప్రయత్నిచడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. ఇది గమనించిన తోటి విద్యార్థినులు, సిబ్బంది ఆమెని నగరంలోని అపోలో హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై గురువారం ఆమె తల్లిదండ్రులు మొకీల పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News