Thursday, January 23, 2025

యువతిని 51సార్లు స్క్రూడైవర్‌తో పొడిచిన ఉన్నాది

- Advertisement -
- Advertisement -

కోర్బా: ఇరవైఏళ్ల యువతి మాట్లాడేందుకు తిరస్కరించడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి స్క్రూడైవర్‌తో పొడిచిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఈ సంఘటన జరిగిందని మంగళవారంతెలిపారు. సౌత్‌ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ పంప్‌హౌజ్ కాలనీలో డిసెంబర్ 24న ఈ సంఘటన జరిగిందని ఎస్పీ విశ్వదీపక్ త్రిపాఠితెలిపారు. బాధిత యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంటిలోకి ప్రవేశించి ఆమె అరుపులు వినపడకుండా పిల్లోతో నోటిని మూసివేసి దాడి చేశాడని ఎస్పీ త్రిపాఠి వివరించారు.

అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని ఆమె సోదరుడు గుర్తించి పోలీసులుకు సమాచారం అందించాడు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు జిల్లాకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. మూడేళ్ల క్రితం నిందితుడు బస్సు కండక్టర్‌గా పనిచేసినపుడు అదేబస్సులో ప్రయాణిస్తుండటంతో స్నేహం పెంచుకున్నాడు. అనంతరం నిందితుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లిపోయినా ఆమెతో ఫోన్‌లో టచ్‌లో ఉండేవాడు. కొంతకాలం తర్వాత మాట్లాడటం మానేయడంతో యువతి తల్లిదండ్రులను కూడా బెదిరించాడు. అయినా యువతి మాట్లాడేందుకు తిరస్కరించడంతో దాడిచేసి పారిపోయాడని ఎస్పీ తెలిపారు. కేసును నమోదు చేసి పట్టుకునేందుకు నాలుగో పోలీస్‌టీమ్‌లను ఏర్పాటుచేసినట్లు ఎస్సీ త్రిపాఠి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News