Wednesday, January 22, 2025

సెల్ఫీ తెచ్చిన తంటా..లోయలోకి జారిపడిన యువతి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర లోని పర్యాటక ప్రదేశం బోరాన్ ఘాట్‌లో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ వంద అడుగుల లోయలోకి జారి పడింది. స్థానికుల సహాయంతో హోంగార్డు లోయలోకి దిగి ఆమెను కాపాడారు. ఆమెను సతారా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. పుణెకు చెందిన ఓ పర్యాటక బృందం బోరాన్‌ఘాట్ వద్దకు శనివారం వచ్చింది. బృందం లోని నస్రీన్ ఖురేషీ అనే యువతి అక్కడ సెల్ఫీ తీసుకుంటూ వంద అడుగుల లోతైన లోయలో జారి పడిపోయింది.

భారీ వర్షాలకు మట్టి జారుడుగా ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి పేర్కొన్నారు. జిల్లా లోని పర్యాటక ప్రాంతాలను శనివారం నుంచి సోమవారం వరకు మూసివేయాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చిన యువత ప్రమాదకర ప్రదేశాల వద్ద జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిప్రవహిస్తున్నాయి. దీంతో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News