Friday, December 27, 2024

మాజీ ప్రియుడితో కలిసి కొత్త ప్రియుడిని చంపిన యువతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి మాజీ ప్రేమికుడు రవికుమార్‌ను చంపేసింది. వట్టెం గ్రామానికి చెందిన కృష్ణమ్మ పొట్టకూటి కోసం కర్నూల్ ప్రాంతానికి వలస వెళ్ళింది. అక్కడ పరిచయమైన శ్రీనివాస్ అనే వ్యక్తితో సహజీవసం చేస్తూ తిరిగి సొంత గ్రామంలో కాపురం పెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రియుడు శ్రీనివాస్ మళ్ళీ పరిచయడం కావడంతో వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరింది. ఈ విషయం గురించి రవికుమార్ కృష్ణమ్మతో తరచు గొడవ పడేవాడు. దీంతో విసిగిపోయిన కృష్ణమమ్మ తన మాజీ ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి యువకుడిని రాయితో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న సిఐ జక్కుల హనుమంతు , ఎస్సై ఓబుల్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన పై గ్రామ విఆర్ఎ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News