Wednesday, January 22, 2025

రాత్రి సమయంలో ప్రయాణించే మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడండి

- Advertisement -
- Advertisement -

Young woman's tweet RTC MD who responded immediately

వాష్‌రూమ్స్ కోసం 10 నిమిషాల్లో పెట్రోల్ పంపుల్లో బస్సును ఆపాలని ఓ యువతి ట్వీట్
వెంటనే స్పందించిన ఆర్టీసి ఎండి
అధికారులకు సూచనలు జారీ చేశానని రీ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాత్రి సమయంలో బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఓ యువతి చేసిన ట్వీట్‌కు ఆ సంస్థ ఎండి సజ్జనార్ స్పందించారు. ఆమె సూచించిన సమస్యకు అధికారులకు సూచనలు జారీ చేశానని ఎండి సజ్జనార్ ఆ యువతి రీ ట్వీట్ ద్వారా తెలియచేశారు. ప్రస్తుతం ఈ విషయమై నెటిజన్‌లు సైతం ఆర్టీసి సంస్థతో ఎండిని ప్రశంసిస్తున్నారు. ప్రయాణికులు చేసే సూచనలకు వెంటనే ఎండి స్పందించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలే నిషా అనే యువతి అర్ధరాత్రి సమయంలో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించే మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంపులలో 10 నిమిషాలు బస్సును ఆపాలని అర్ధరాత్రి టిఎస్ ఆర్టీసికి ట్వీట్ చేసింది. రాత్రి సమయంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ యువతి ఆ ట్వీట్‌లో పేర్కొంది. అర్ధరాత్రి చేసిన ట్వీట్‌కు ఆర్టీసి ఎండి సజ్జనార్ స్పందించడంతో పాటు అధికారులకు సూచనలు జారీ చేశామని ఆయన ఆ యువతికి రీ ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News