Wednesday, January 22, 2025

ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Union Home Ministry released NCRB data on suicides

కామారెడ్డి జిల్లా: ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా  బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ చెరువులో దూకి పంచశీల 20 అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.  డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్ లో ఉంటూ మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్ష సరిగా రాయలేనని మనస్థాపంతో ఆత్మహత్యకు యువతి పాల్పడింది. హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు వెళ్తూ మార్గ మధ్యలో జంగంపల్లి గ్రామ స్టేజీ వద్ద యువతి దిగింది. అక్కడి నుంచి వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామం వాసురాలుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News