Thursday, January 23, 2025

పెళ్లి సంబంధాలు చూస్తున్నారని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Engineering student commits suicide in dundigal

 

మన తెలంగాణ/ అమరావతి: డిగ్రీ చదువుతున్న యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగప్ప కూతురు పునీత(19) హిందూపురంలో డిగ్రీ చదువుతోంది. ఆమె పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. పునీత మాత్రం తనకు ఇప్పుడు పెళ్లి వద్దని చదువుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపింది. తల్లిదండ్రులు పెళ్లి చేస్తానని సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపం చెంది యువతి ఇంట్లో ఉరేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ మునీర్ అహ్మద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News