Monday, November 25, 2024

పెళ్లి రద్దు…. అమెరికాలో తెలుగు యువతి ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Young women commit suicide over marriage cancel/

అమరావతి: పెళ్లి కుమారుడు వివాహానికి నిరాకరించడంతో చిత్తూరు చెందిన యువతి అమెరికాలోని టెక్సాస్‌లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్తూరు జిల్లా క్రేందంలోని శ్రీహరి కూతురు సుష్మా(25) యుఎస్‌ఎలో చదువుతోంది. అదే జిల్లాకు చెందిని మురళీ తనయుడు భరత్ అమెరికాలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులు వారికి వివాహనం నిశ్చయించారు. మార్చి మూడో తేదీన పెళ్లి జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. భరత్, సుష్మా మధ్య విభేదాలు రావడంతో పెళ్లి చేసుకోవడానికి సమయం కావాలని తల్లిదండ్రులను భరత్ కోరాడు. ఇరు కుటుంబ సభ్యులు ఇద్దరికి నచ్చజెప్పడంతో అన్ని సర్దుకున్నాయని వారు భావించారు. మూడో తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా భరత్ పెళ్లి వద్దని చెప్పడంతో సుష్మా తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో పెళ్లి రద్దు కావడంతో సుష్మా టెక్సాస్‌లో ఆత్మహత్య చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News