Monday, December 23, 2024

మెట్రో రైలులో డ్యాన్స్ చేసిన యువతి…(వైరల్ )

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మెట్రో రైలులో ఓ యువతి చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మోడ్రన్ డ్రస్ వేసుకున్న బక్క పలుచని అమ్మాయి డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చూసి అక్కడ ఉన్నవారు ఫిదా అయ్యారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రెండు రోజుల వ్యవధిలో ఒక ట్విట్టర్‌లోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం నెటింట్లో వైరల్ మారడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె డ్యాన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. డ్యాన్య్ లో కదలికలు కూడా సూపర్‌గా ఉన్నాయని కొనియాడారు. అమ్మాయిని డ్యాన్స్ షోకు పంపిస్తే కప్ గెలవడం ఖాయమని కొందరు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత కొందరు ఒక్క రోజులోనే తమ ట్యాలెంట్ తో సెలబ్రిటీగా మారిపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News