Thursday, January 23, 2025

యువతి ప్రాణాలు తీసిన ఫోటో…

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల్: దగ్గర బంధువుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతపురం గ్రామంలో మేఘలత అనే అమ్మాయి(20) తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అనంతపురం గ్రామానికి చెందిన దగ్గరి బంధువు శివ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అతడి ప్రేమను ఆమె తిరస్కరించడంతో పాటు హెచ్చరించింది.

ఇద్దరు మధ్య గొడవ ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో మేఘలతకు పెళ్లి సంబంధం ఖాయం చేశారు. శివ కుమార్ నవంబర్ 6న ఆత్మహత్య చేసుకున్నాడు. శివ చనిపోయిన తరువాత అతడి స్నేహితులు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో మానసిక వేధనతో ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమె ఉరేసుకుంది. “నాన్నా నేను నీ కుమార్తెను ప్రాణం పోయినా తప్పు చేయను” అని, సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసిన వారిని వదలకు అని తండ్రికి సూసైడ్ నోట్ రాసింది. ఎస్‌ఐ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News