Wednesday, March 26, 2025

అల్వాల్‌లో ఎంఎంటిఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం… ట్రైన్‌లో నుంచి దూకి

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: ఎంఎంటిఎస్ రైలులో ఓ యువతిపై కామాంధుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె ట్రైన్‌లో బయటకు దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపిలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి(23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సెల్‌ఫోన్ పని చేయకపోవడంతో మరమ్మతు కోసం సికింద్రాబాద్‌కు వచ్చింది. సెల్‌ఫోన్ మరమ్మతు చేసుకొని సికింద్రాబాద్‌లో ఎంఎంటిఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది.

మహిళల కోచ్‌లో ఆమె ఎక్కింది. బోగీలో ఉన్న ఇద్దరు మహిళలు అల్వాల్ దిగిపోవడంతో యువతి ఒంటరిగా ఉంది. ఇదు అదునుగా భావించిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకొని ట్రైన్ నుంచి బయటకు దూకింది. కోంపల్లి శివారులో రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆమె త్రీవంగా గాయపడడం గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News