Friday, December 20, 2024

యువతి కిడ్నాప్… ఎత్తుకుని అగ్నిగుండం చుట్టు తిరిగాడు….

- Advertisement -
- Advertisement -

జైపూర్: ప్రేమోన్మాది యువతిని తన అనుచరులతో కిడ్నాప్ చేసి అనంతరం బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జూన్ 12న ఓ యువతికి, యువకుడిరి పెళ్లి జరగాల్సి ఉంది. పుష్పేంద్ర అనే ప్రేమోన్మాది ఆమెను కిడ్నాప్ చేసి ఏడారి ప్రాంతంలో తీసుకెళ్లాడు. గడ్డి మంట వేసి ఆమె ఎత్తుకొని ఏడుసార్లు తిరిగాడు. మళ్లీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని ఆమెను హెచ్చరించాడు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: స్త్రీలను కించపరిచిన పాఠ్యగ్రంథాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News