Monday, December 23, 2024

డబ్ల్యూపీఎల్‌తో యువతుల కలలు సాకారం: నీతా అంబానీ

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) యువతుల కలలను సాకారం చేయనుందని ముంబై జట్టు యజమాని నీతా అంబానీ తెలిపారు. యువతులు తమ కలలను అనుసరించి క్రీడల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. శనివారం లీగ్ తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. డబ్లూపిఎల్ ఆరంభ వేడుకలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, మహిళా క్రీడా ప్రపంచంలో ప్రత్యేక రోజుగా నీతా అంబానీ అభివర్ణించారు. డబ్లూపిఎల్‌లో భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. డబ్లూపిఎల్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ జెయింట్స్ ఘనవిజయం సాధించింది. 143పరుగుల తేడాతో గెలుపొంది ఆరంభ మ్యాచ్‌లోనే సత్తా చాటింది.

డ్రెస్సింగ్ రూమ్ వేడుకల్లో నీతా అంబానీ మాట్లాడుతూ డబ్లూపిఎల్ ఎంతోమంది మహిళలకు ప్రేరణగా దేశంలోని యువతులు క్రీడారంగంలో తమ కలలను సాకారం చేసుకునేందుకు డబ్లూపిఎల్ దిక్సూచీగా నిలుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. తొలిమ్యాచ్‌లోనే రికార్డుస్థాయిలో విజయం సాధించడంపై ముంబై జట్టును నీతా అంబానీ అభినందించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుత ప్రదర్శనను అభినందించారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో మహిళా క్రీడాకారులు పురుషుల జట్టుకు తీసిపోరని నిరూపించారన్నారు. మహిళల మెగాలీగ్‌లో ఆడుతునన జట్లుకు నీతా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News