Sunday, January 19, 2025

ఆస్థి గొడవ: తమ్మున్ని హత్య చేసిన అన్న

- Advertisement -
- Advertisement -

మద్నూర్: మండలంలోని సోనాల గ్రామంలో ఆస్థి గొడవల్లో తమ్మున్ని అన్న హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. విజయ్ పటేల్, రాజులు అన్నదమ్ములని, ఆస్థి తగాదాల విషయంలో శనివారం రాత్రి గొడవ జరిగిందన్నారు. కాగా, అన్న రాజు తమ్ముడు విజయ్ పటేల్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడన్నారు. విజయ్ పటేల్ బీఆర్‌ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసేవాడని, బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా పనిచేశాడన్నారు.

హత్య విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే అంత్యక్రియల్లో పాల్గొని పాడెను మోశారు. ఆస్థి తగాదాలతో హత్య జరుగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని డీఎస్పీతో పాటు సిఐ కృష్ణ, ఎస్సై కృష్ణారెడ్డిలు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News