Monday, December 23, 2024

తమ్ముడిని హత్య చేసిన అన్న

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తన భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఆగ్రహంతో తమ్ముడిని హత్య చేసిన సంఘటన ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఫిల్మ్‌నగర్, బసవతారకనగర్‌కు చెందిన షబ్బీర్ అహ్మద్, సాజిద్ అన్నదమ్ములు. ఇద్దరు కలిసి వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. షబ్బీర్ భార్యను సాజిద్ అహ్మద్ మద్యం తాగి వచ్చి నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. మద్యం తాగి భూతులు తిట్టడమే కాకుండా, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో షబ్బీర్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరు సోదురులు కలిసి గురువారం తెల్లవారుజామున మద్యం తాగారు.

మద్యం తాగుతుండగానే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన భార్యను వేధించడం వల్లే పుట్టింటికి వెళ్లిందని షబ్బీర్ ఆగ్రహంతో సోదరుడు సాజిద్‌ను నరికి చంపాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి హత్య చేసిన విషయం చెప్పాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News