Sunday, December 22, 2024

తమ్ముడిని కడతేర్చిన అన్న

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: తోడబుట్టిన తమ్ముడిని అన్న హతమార్చిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కుండె కుమారస్వామి (35), కుండె రవి అన్నదమ్ములు. ఇటీవల కాలంలో వీరి అక్క మృతి చెందగా మృతురాలి చెవి కమ్మలు కుండె రవి వాడుకొని ఇవ్వడం లేదంటూ మృతుడు కుమారస్వామి మద్యం మత్తులో తీవ్ర పదజాలంతో దూషించాడు.

దీంతో భావోద్వేగానికి గురైన రవి కోపంతో తమ్ముడిని కత్తితో గొంతు కోసినట్లు హత్య చేసినట్లు తెలిపారు. కాగా మృతునికి గతంలో పెళ్లి జరుగగా మద్యానికి బానిసయ్యాడనే కారణంతో భార్య విడాకులు ఇచ్చింది. అప్పటి నుంచి మద్యానికి బానిసై ప్రతీ రోజు ఇంట్లో వారితో గొడవ పడేవాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News