Sunday, December 22, 2024

తమ్ముడిని చంపిన అన్న

- Advertisement -
- Advertisement -

ప్రతి రోజు మద్యం, గంజాయి సేవించి ఇంట్లో గొడవ చేస్తున్న సొంత తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల కథనం ప్రకారం… ఆసిఫ్ నగర్, ఫీల్ ఖానా ప్రాంతానికి చెందిన సయ్యద్‌కు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు అయుబ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, రెండో కుమారుడు పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్ళాడు. మూడో కుమారుడు సహిద్ ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు, చిన్న కుమారుడు మహమ్మద్ ఫిరోజ్ (28) పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. రోజు మద్యం తాగి, గంజాయి తీసుకుని ఇంటికి వచ్చి ఫిరోజ్ తనకు వివాహం చేయడంలేదని సోదరులతో గొడవపడుతున్నాడు. రోజు ఇంట్లో గొడవ చేస్తుండడంతో విసుగుచెందిన సోదరుడు సహిద్ తన మిత్రుడు షానవాజ్ సహాయంతో ఏదో ఒకటి చేయాలని ప్లాన్ వేశాడు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించి వచ్చిన ఫిరోజ్, సహిద్ మొబైల్ ఫోన్‌ను తీసుకుని బయటికి పారిపోయాడు. తర్వాత అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ఫిరోజ్‌తో సహిద్ గొడవపడ్డారు. తర్వాత సహిద్ తన మిత్రుడు శానవాజ్ తో కలిసి మూడవ అంతస్తు పైకి ఫిరోజ్‌ను తీసుకుని వెళ్లి ఓ రూమ్‌లో ఫిరోజ్ ను రాడ్డులతో కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య విషయం స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్‌ను హత్య చేసిన ఇద్దరు నిందితులను ఆసిఫ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News