Sunday, December 22, 2024

అన్నను కర్రతో కొట్టి చంపిన తమ్ముడు…

- Advertisement -
- Advertisement -

వాజేడు : తమ్ముడు అన్నను కర్రతో కొట్టి చంపిన సంఘటన ములుగుజిల్లా వాజేడు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతి తెలిపిన కధనం ప్రకారం మండలంలోని కొప్పుసూరు గ్రామానికి చెందిన రొడ్డ చంద్రశేఖర్ రావు(50) వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మృతుడు మద్యం సేవించి తన తమ్ముడు అయిన రొడ్డ నరసింహారావును అకారణంగా దుర్భషలాడుతుండగా క్షణికావేశంలో తన అన్నను కర్రతో తల పై కొట్టడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుని భార్య రొడ్డ పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై వాజేడు, వెంకటాపురం సిఐ కాగితోజు శివప్రసాద్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News