Tuesday, March 4, 2025

అన్నను చంపిన తమ్ముడు..ఆత్మహత్యగా చిత్రీకరణ

- Advertisement -
- Advertisement -

తన సొంత అన్నను చంపిన తమ్ముడు సంఘటన మెదక్ జిల్లా, చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాసాయిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన తుంపల చందు, తుంపల మహేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు చనిపోయారు. పెళ్లిళ్లు అయినా, వారి భార్యలు మాత్రం వీరి నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నారు. అప్పటి నుండి ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటున్నారు.

సోమవారం సాయంత్రం చందు కూరగాయలు తీసుకోవడానికి బయటకి వెళ్లి మద్యం తాగి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. అన్న మహేశ్ ఎందుకు లేటుగా వచ్చావని తమ్ముడిని బూతు మాటలు తిట్టాడు. దీంతో కోపం వచ్చి అన్నను చంపితే తాను ఒక్కడినే ఇంట్ల్లో ఉండవచ్చుని పథకం వేశాడు. ముందుగా అనుకున్న ప్రకారం గొంతు పిసికి, చంపి వైరుతో అన్న మెడకు ఉరి వేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News