Monday, December 23, 2024

సంగారెడ్డిలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని డిగ్రీ విద్యార్థినీ వేధిస్తున్న ప్రేమోన్మాది బ్లెడ్‌తో దాడి చేయడం సంగారెడ్డిలో కలకలం సృష్టించింది. బుధవారం సంగారెడ్డి డిఎస్‌పి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీలో మనూర్ మండలానికి చెందిన అఖిల డిగ్రీ చదువుతోంది. మీ సేవ కేంద్రంలో నారాయణఖేడ్ మండలం ర్యకాల పోతాంగల్‌కు చెందిన ప్రవీణ్ (22)తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ప్రేమించాలని నిత్యం అఖిలను వేధిస్తూ వస్తున్నాడన్నారు. అతని వేధింపులు భరించలేక యువతి హైదరాబాద్‌కు వెళ్లింది.

సెకండియర్ పరీక్ష రాసేందుకు తారా డిగ్రీ కాలేజీకి వస్తుందని విషయం తెలుసుకున్న నిందితుడు ప్రవీణ్ తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే బ్లేడుతో దాడి చేసి చంపేస్తా బెదిరిస్తూ దాడికి పాల్పడ్డాడని చెప్పారు. అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు దాడిని అడ్డుకొని ప్రవీణ్‌ను చితకబాది సంగారెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకొని అఖిలను పరీక్ష రాసేందుకు కాలేజీలోకి పంపారు. దాడికి పాల్పడ్డ నిందితుడు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిఎస్‌పి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News