Sunday, January 12, 2025

కీసరలో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిదాస్ పల్లి గ్రామ శివారులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. బుధవారం ఉదయం హరిదాస్ పల్లి నుంచి దమ్మాయిగూడకు వెళ్లే రోడ్డు పక్కన రక్తపు మడుగులో ఓ వ్యక్తి మ రణించి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇ చ్చారు. మృతుడు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకడారం గ్రామానికి చెందిన చిరమైన మహిపాల్ యాదవ్ (26)గా పోలీసులు గుర్తించారు. సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకడారం గ్రామానికి చెందిన మహిపాల్ యాదవ్ గత 15 సంవత్సరాల క్రితం బతుకుదెరువు నిమిత్తం తన తండ్రి కనకయ్య,

తల్లి లక్ష్మీనర్సమ్మతో వలస వచ్చి కాప్రా ఎల్లారెడ్డిగూడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మహిపాల్ యాదవ్ డిజె ఇవెంట్ మేనేజ్ మెంట్ పని చేస్తున్నాడు. మృతుడు మంగళవారం రాత్రి దమ్మాయిగూడలోని ఓ మద్యం దుకాణం వద్ద స్నేహితులతో కలిసి మద్యం కొనుగోలు చేసి హరిదాస్ పల్లి సమీపంలోని నిర్మానుష ప్రదేశానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ అందరూ కలిసి మద్యం సేవిస్తుండగా జరిగిన ఘర్షణలో కత్తితో అతనిపై దాడి జరిగినట్లు తెలిసింది. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేసర సీఐ వెంకటయ్య తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News